హైదరాబాద్‌లో యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  15 Oct 2024 10:58 AM IST
young woman, auto driver,Hyderabad, Crime

హైదరాబాద్‌లో యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

హైదరాబాద్‌: ఆడ పిల్లలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా అయిపోయింది. బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న కూడా రాత్రి సమయంలో ఇంటికి వెళ్ళే సమయంలో భయంతో వణికి పోతున్నారు. ఎక్కడి నుండి ఏ కామాంధుడు వచ్చి కాటేస్తాడోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు చెన్నై నుండి హైదరాబాద్‌కు వచ్చిన యువతి.. లింగపల్లి వద్ద దిగింది.

ఆ తర్వాత ఆమె నివసించే నాన్‌క్రామ్‌గూడకు వెళ్లడానికి ఒక ఆటో ఎక్కింది. ఈ క్రమంలోనే ఆటోలో వెళ్తుండగా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మసీద్‌ బండ ప్రాంతంలో డ్రైవర్‌.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను మసీదు బండ సమీపంలోని పాఠశాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో నిందితుడు ఆమె గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అతను నగదు, ఐడీ కార్డు మొదలైనవాటిని కలిగి ఉన్న బాధితురాలి హ్యాండ్‌ బ్యాగ్‌ను తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు యువతిని వెంటనే వైద్య పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story