హైదరాబాద్‌లో దారుణం.. బాలుడిపై యువతి లైంగిక దాడి.. బ్రదర్‌ అంటూనే..

హైదరాబాద్‌ నగరంలో దారుణం జరిగింది. బ్రదర్‌.. బ్రదర్‌ అంటూ మచ్చిక చేసుకుని 16 ఏళ్ల బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడింది.

By అంజి
Published on : 3 May 2025 10:23 AM IST

young woman, assaulted, minor boy, Hyderabad, Crime

హైదరాబాద్‌లో దారుణం.. బాలుడిపై యువతి లైంగిక దాడి.. బ్రదర్‌ అంటూనే..

హైదరాబాద్‌ నగరంలో దారుణం జరిగింది. బ్రదర్‌.. బ్రదర్‌ అంటూ మచ్చిక చేసుకుని 16 ఏళ్ల బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. ఇంటి పక్కన ఉండే యువతి పలుమార్లు తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిందని బాలుడు చెప్పాడు. తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తల్లిదండ్రుల దృష్టికి బాలుడు తీసుకురావడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. బాధితుడి తల్లిదండ్రులు.. నిందితురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తోన్న మహిళ తన భర్త, కొడుకుతో కలిసి సర్వెంట్స్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటోంది. వీరి క్వార్టర్స్‌ పక్కనే మరో క్వార్టర్స్‌లో యువతి ఉంటోంది. బాలుడు, యువతి.. బ్రదర్‌, సిస్టర్‌ అని పిలుచుకునేవారు. స్కూల్స్‌కి సెలవులు రావడంతో బాలుడు ఇంటి వద్దే ఉంటున్నాడు. గతంలో ఓసారి బాలుడిని యువతి ముద్దుపెట్టుకోవడంతో తల్లి నిలదీసింది. ఇటీవల బాలుడితో యువతి అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది.

నిన్ను ఇష్టపడుతున్నానని, నేను ఏం చేసినా సైలెంట్‌గా ఉండాలని లేదంటే దొంగతనం కేసు పెట్టి మీ అమ్మ ఉద్యోగం తీయిస్తానని యువతి బాలుడిని బెదిరించింది. దీంతో బాలుడు ఆమె చెప్పినట్టు చేసుకుంటూ వచ్చాడు. యువతి మరింత హద్దులు మీరి ప్రవర్తించడంతో బాలుడు జరిగిందంతా తన తల్లిదండ్రులకు చెప్పాడు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story