అమరావతి: అశ్లీల చిత్రాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయనడానికి ఈ దారుణ ఘటనే నిదర్శనం. కడప జిల్లా కలసపాడు మండలం గంగయ్యపల్లెలలో ఈ నెల 7న చిన్నారి(3) పై అదే గ్రామానికి చెందిన నరేంద్ర (20) అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరేంద్ర ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసేవాడని, వాటి ప్రభావంతోనే అఘాయిత్యానికి ఒడిగట్టాడని వారు తెలిపారు. పిల్లల ఫోన్ల వాడకంపై పేరేంట్స్ ఓ కన్నేయాలని పోలీసులు సూచించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోరుమామిళ్ల సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన కలసపాడు మండలంకు చెందిన నరేంద్ర అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన మూడేళ్ల బాలికను ఇంటికి సమీపంలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడిని పోరుమామిళ్ల మండలంలోని మార్కాపురం సర్కిల్ వద్ద అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు ఇచ్చే సమయంలో వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని సూచించారు.