ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. నిజామాబాద్‌ తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడికి బాలిక పరిచయం అయ్యింది. బాలికతో చాటింగ్‌ అంటూ మొదలు పెట్టిన అతడు.. ఆమెకు మాయ మాటలు చెప్పాడు.

By అంజి  Published on  27 Oct 2024 8:14 AM IST
Instagram, Nizamabad, Warangal, Crime

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. నిజామాబాద్‌ తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడికి బాలిక పరిచయం అయ్యింది. బాలికతో చాటింగ్‌ అంటూ మొదలు పెట్టిన అతడు.. ఆమెకు మాయ మాటలు చెప్పాడు. బాలికను నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామబాద్‌ పట్టణానికి చెందిన సబీల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. అతడికి వరంగల్‌కు చెందిన ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీన వరంగల్‌కు వచ్చిన సబీల్‌.. బాలికను కలిశాడు. ఆమెను వెంట పెట్టుకుని నిజామాబాద్‌ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అప్పటికే బాలిక కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ నెల 7వ తేదీన సబీల్‌.. మైనర్‌ బాలికను వరంగల్‌కు తీసుకొచ్చి వదిలేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు సబీల్‌ను ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. పోక్సో, అత్యాచారం కేసు ఫైల్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికలు, యువతులు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని సీఐ షుకూర్‌ సూచించారు.

Next Story