అమెరికాలో తెలంగాణ యువకుడు దుర్మరణం.. కాంగ్రెస్ నేత కూడా!!

హైదరాబాద్ నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడు మహమ్మద్ వాజిద్ అమెరికాలో మరణించాడు.

By అంజి
Published on : 30 Jan 2025 9:11 AM IST

young man, Hyderabad died, America, road accident

అమెరికాలో తెలంగాణ యువకుడు దుర్మరణం.. కాంగ్రెస్ నేత కూడా!! 

హైదరాబాద్ నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడు మహమ్మద్ వాజిద్ అమెరికాలో మరణించాడు. చికాగోలో ఉన్నత చదువులు చదువుతున్న వాజిద్ బుధవారం నాడు మసాచుసెట్స్‌లోని ప్లైమౌత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి కారును ట్రక్కు ఢీకొట్టగా.. ఆ ప్రమాదంలో మరణించాడని అమెరికా అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7 లేదా 8 గంటల సమయంలో జరిగింది. వాజిద్ ఖైరతాబాద్ డివిజన్‌లో యువజన కాంగ్రెస్‌ నాయకుడు. USAలో ఎన్నారై మైనారిటీ కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా కూడా పనిచేశారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి వాజిద్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. దట్టమైన పొగమంచు, దృశ్యమానత సరిగా లేకపోవడం వాజిద్ రోడ్డు ప్రమాదానికి దారితీసిందని రోహిణ్ రెడ్డి పేర్కొన్నారు. వాజిద్ కుటుంబం గురువారం USA కి వెళ్లనుంది, అక్కడ అతని అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Next Story