రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కమలా ఫుడ్స్ బిస్కట్ పరిశ్రమలో ఓ మహిళ కార్మికులు మృతి చెందింది. రన్నింగ్ మిషన్‌లో కార్మికురాలి చీర తట్టుకుని ఈ ఘటన జరిగింది. మహిళ చీర తట్టుకుని ఒక్కసారిగా మిషన్‌లోకి పడిపోయింది. దీంతో మహిళా కార్మికురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన మిగతా కార్మికులు ఆమె వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మహిళా కార్మికురాలు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.