Hyderabad: విషాదం.. లారీ ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాచారం వద్ద ఎల్‌పీజీ సిలిండర్‌తో వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

By అంజి
Published on : 19 Sept 2024 1:48 AM

woman died, lorry, Nacharam ,Hyderabad, Crime

Hyderabad: విషాదం.. లారీ ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాచారం వద్ద ఎల్‌పీజీ సిలిండర్‌తో వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని అంబర్‌పేటకు చెందిన సందిరి నీత (38)గా గుర్తించారు. నీత తన పిల్లలను మల్లాపూర్‌లోని జాన్సన్ గ్రామర్ హైస్కూల్‌లో దించేందుకు వెళ్లిన సమయంలో నాచారంలోని హెచ్‌ఎంటీ జంక్షన్ వద్ద ఉదయం 8 గంటలకు ఈ ఘటన జరిగిందని నాచారం ఇన్‌స్పెక్టర్ జి రుద్వీర్ కుమార్ తెలిపారు.

ఎల్‌పీజీ సిలిండర్‌తో వెళ్తున్న ట్రక్కు ఆమె స్కూటర్‌ను ఢీకొనడంతో ఆమె వాహనంపై నుంచి కిందపడింది. నీతా తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. లారీలో గ్యాస్ సిలిండర్లు తీసుకుని చర్లపల్లి ఐఓసీ డిపో నుంచి రాంనగర్, నల్లకుంట వైపు వెళ్తున్నట్లు తెలిపారు. మృతురాలి భర్త ఎస్ విజయ్ ఫిర్యాదు మేరకు ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోందని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

Next Story