ఏలూరులో దారుణం.. కన్న కూతుళ్లను రెండో భర్తకి ఇచ్చి పెళ్లి చేసిన భార్య

పేగు బంధానికి మచ్చతెచ్చేలా ఓ కన్న తల్లి దారుణంగా వ్యవహరించింది. వయసు వచ్చిన తన కుమార్తెలను రెండో భర్తకు ఇచ్చి కట్టబెట్టింది.

By అంజి  Published on  14 July 2023 6:52 AM IST
Eluru district, Crime news, Disha Police, APnews

ఏలూరులో దారుణం.. కన్న కూతుళ్లను రెండో భర్తకి ఇచ్చి పెళ్లి చేసిన భార్య

పేగు బంధానికి మచ్చతెచ్చేలా ఓ కన్న తల్లి దారుణంగా వ్యవహరించింది. వయసు వచ్చిన తన కుమార్తెలను రెండో భర్తకు ఇచ్చి కట్టబెట్టింది. తల్లి తన కూతుర్ల పట్ల వ్యవహరించిన ఈ తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. కూతుర్ల ఫిర్యాదుతో దిశ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం నాడు తల్లి, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ మహిళకు భర్త, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ సర్జరీ చేయించుకుండి. 2007లో ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో.. తన మేనత్త కొడుకును రెండో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి తనకు పిల్లలు కావాలని, లేదంటో మరో వివాహం చేసుకుంటానని అతడు బెదిరింపులకు దిగాడు. చివరకు కొన్నేళ్లు గడిచాయి. ఆడపిల్లలు ఇద్దరూ యుక్త వయస్సుకు వచ్చారు. వేరే పెళ్లి వద్దని, తన కూతుళ్లతోనే పిల్లల్ని కనాలని రెండో భర్తను భార్య ఒప్పింది.

ఈ క్రమంలోనే 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు సంవత్సరం కిందట మగశిశువు పుట్టి చనిపోయాడు. ఆ మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఇటీవల భర్తతో విభేదాలు వచ్చాయి. దాంతో కుమార్తెలను గ్రామంలోనే వదిలేసి వైజాగ్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే చిన్న కుమార్తె తనకు పరిచయమైన యువకుడికి ఇదంతా చెప్పడంతో.. అతడు పిల్లల మేనమామకు తెలిపాడు. బంధువులందరూ ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. దిశ సీఐ ఇంద్రకుమార్‌ ఆధ్వర్యంలో నిందితులపై పోక్సో కేసు నమోదుచేశారు.

Next Story