హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మహబూబ్‌పేట్ ఏరియాలోని మక్తలోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. వీరిని కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలి వాసులుగా గుర్తించారు.