వ్యాపార విషయమై చర్చిద్దామని.. హోటల్​కు పిలిచి మహిళపై అత్యాచారం

A Tamil Nadu businessman called a woman to a hotel and raped her. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. వ్యాపారం విషయమై చర్చిద్దామంటూ

By అంజి  Published on  13 Aug 2022 3:46 PM IST
వ్యాపార విషయమై చర్చిద్దామని.. హోటల్​కు పిలిచి మహిళపై అత్యాచారం

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. వ్యాపారం విషయమై చర్చిద్దామంటూ సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లోని హోటల్‌కు ఓ మహిళను పిలిచి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గత శనివారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు.. తనకు నిందితుడు చాలా ఏళ్లుగా తెలుసునని చెప్పింది. బాధితురాలు కొన్ని ఏళ్లుగా ఓ వ్యాపారం ప్రారంభించాలనుకుంటోంది. ఈ క్రమంలోనే ఇదే విషయమై చర్చిద్దామంటూ తమిళనాడుకు చెందిన వ్యాపారి ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు పిలిచాడు.

హోటల్‌ గదిలో వ్యాపారిని కలిసిన తర్వాత.. పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుని మహిళపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన జరిగిన తర్వాత మహిళ కోలుకోలేకపోయింది. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆగస్టు 10న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి తమిళనాడులో తలదాచుకున్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి జాడ కోసం పోలీసు బృందాన్ని తమిళనాడుకు పంపించారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డీసీపీ ఆర్.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Next Story