యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు మరణించారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు.. లారీని ఢీకొట్టింది.
విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో శని ఆదివారాల్లో ప్రభుత్వ సెలవు దినాలు.. రెండు రోజులు సెలవు రావడంతో హైదరాబాదులో ఉన్న కుటుంబ సభ్యులను కలవడానికి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన ఇద్దరి కుటుంబాలు కూడా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాయి. తీవ్ర గాయాలు పాలైన అదనపు ఎస్పీని, డ్రైవర్‌ను హైదరాబాద్ కామినేని కి తరలించారు. మృతులు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో డీఎస్పీలు విధులు నిర్వర్తించారు.