ఆచారాల పేరుతో యువతిపై అత్యాచారం.. స్వయం ప్రకటిత దేవుడు అరెస్ట్‌

A self-proclaimed god who raped a woman has been arrested by the police. ఆచారాల పేరుతో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన 58 ఏళ్ల స్వయం ప్రకటిత దేవుడ్ని ముంబైలో పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  12 Sept 2022 1:19 PM IST
ఆచారాల పేరుతో యువతిపై అత్యాచారం.. స్వయం ప్రకటిత దేవుడు అరెస్ట్‌

ఆచారాల పేరుతో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన 58 ఏళ్ల స్వయం ప్రకటిత దేవుడ్ని ముంబైలో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుంచి (2019) నుంచి బాధితురాలిపై నిందితుడు పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొంతమంది వ్యక్తులు పరిచయం చేయడంతో బాధిత కుటుంబానికి సురేష్ కుమార్ రవీంద్ర నారాయణ్ అవస్తి అనే స్వయం ప్రకటిత దేవతతో పరిచయం ఏర్పడింది.

వెర్సోవా పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ..''ఆచారాల పేరుతో అతను 2019 నుండి (ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు) బాధితురాలిపై చాలాసార్లు అత్యాచారం చేశాడు. ఆమె నుంచి అభ్యంతరకరమైన ఫోటోలను తీశాడు. ఈ చిత్రాలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు పలు మార్లు ఆమెపై లైంగిక దాడి కొనసాగించాడు.'' అని చెప్పారు. ఇటీవల బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని భారత శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం నిబంధనల కింద ఆదివారం అరెస్టు చేశారు. స్వయం ప్రకటిత దేవుడు అని చెప్పుకుంటున్న సురేష్‌ ప్రొఫెషనల్ టెక్నీషియన్ అని పోలీసులు తెలిపారు.


Next Story