హోటల్ రూమ్‌లో 17 ఏళ్ల షూటర్‌పై కోచ్ అత్యాచారం
ఫరీదాబాద్‌లోని ఒక హోటల్ గదిలో 17 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్‌పై కోచ్ అత్యాచారం చేశాడు
By - Knakam Karthik |
హోటల్ రూమ్‌లో 17 ఏళ్ల షూటర్‌పై కోచ్ అత్యాచారం
హర్యానా: నేషనల్ లెవెల్ షూటింగ్ క్రీడలో కలకలం నెలకొంది. ఫరీదాబాద్‌లోని ఒక హోటల్ గదిలో 17 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్‌పై కోచ్ అత్యాచారం చేశాడు. ఆమె పనితీరును అంచనా వేసే నెపంతో అత్యాచారం చేసినట్లు జాతీయ షూటింగ్ కోచ్‌పై ఆరోపణలు ఉన్నాయని, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి కుటుంబం ఫిర్యాదు ప్రకారం, న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో అథ్లెట్ పనితీరును విశ్లేషిస్తానని చెప్పి, భరద్వాజ్ ఆమెను తన గదికి పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే కెరీర్‌ను నాశనం చేస్తానని, కుటుంబాన్ని ఇబ్బంది పెడతానని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుతో ఫరీదాబాద్ ఎన్‌ఐటీలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 6, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 351(2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని, హోటల్ మరియు పరిసర ప్రాంతాల నుండి సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నామని ఫరీదాబాద్ పోలీసు ప్రతినిధి యశ్‌పాల్ సింగ్ తెలిపారు.