వీడియో తీసి లైంగిక వేధింపులు.. నిప్పంటించుకున్న మైనర్‌ బాలిక

A minor girl who was sexually abused in Chennai tried to commit suicide. నలుగురు వ్యక్తులు ఓ మైనర్‌ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర ఒత్తడికి గురై బలవంతంగా మైనర్‌ బాలిక

By అంజి
Published on : 30 Sept 2022 6:20 AM

వీడియో తీసి లైంగిక వేధింపులు.. నిప్పంటించుకున్న మైనర్‌ బాలిక

నలుగురు వ్యక్తులు ఓ మైనర్‌ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర ఒత్తడికి గురై బలవంతంగా మైనర్‌ బాలిక ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగింది. పోక్సో చట్టం కింద నలుగురిని తిరువళ్లూరు పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు తాను, తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న సమయంలో తీసిన వీడియో క్లిప్‌ని ఉపయోగించి తనను లైంగికంగా వేధించారని, అందుకే ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని బాలిక పోలీసులకు తెలిపింది.

బాలికకు 40% కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 12వ తరగతి చదువుతున్న బాలిక 10 రోజుల క్రితం పశువులను మేపేందుకు వెళ్లిన సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసింది. అదే గ్రామానికి చెందిన బాలుడితో ఆమె మాట్లాడినప్పుడు నలుగురు నిందితులు అక్కడికక్కడే ఉన్నారు. వారిద్దరు కలిసి ఉన్నప్పుడు నిందితులు వీడియో తీశారు. ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. అప్పుడే అసలు సమస్య మొదలైంది. నిందితులు బాలికను వెతికి పట్టుకుని లైంగికంగా వేధించడం ప్రారంభించారని పోలీసులు పేర్కొన్నారు.

తమతో రాకపోతే వీడియోను ఆమె తల్లిదండ్రులకు చూపిస్తామని 25 ఏళ్ల అజిత్ కుమార్, 20 ఏళ్ల జ్ఞానమూర్తి, 23 ఏళ్ల రసకన్ను, 26 ఏళ్ల అజిత్‌రాజ్‌లు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక సోమవారం రాత్రి నిప్పంటించుకుంది. ఆమె చికిత్సను తిరువళ్లూరు జనరల్ హాస్పిటల్ నుండి కిల్‌పాక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి రిఫర్‌ చేశారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Next Story