దారుణం.. రూ.30 కోసం వ్యక్తిని చంపారు

ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో గురువారం ఒక వ్యక్తిని ఇద్దరు సోదరులు కేవలం రూ. 30 కోసం కొట్టి, కత్తితో పొడిచి చంపారు.

By అంజి  Published on  24 Feb 2023 10:25 AM IST
Delhi, Crime news, Brutal murder

ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో ఇద్దరు సోదరులు ఓ వ్యక్తిని కొట్టి, కత్తితో పొడిచి చంపారు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో గురువారం ఒక వ్యక్తిని ఇద్దరు సోదరులు కేవలం రూ. 30 కోసం కొట్టి, కత్తితో పొడిచి చంపారు. మృతుడు సోను అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు పలు వివాహాల్లో క్యాటరింగ్ చేసేవాడు. నిందితుల్లో ఒకరైన రాహుల్ కూడా అతనితో కలిసి పనిచేశాడు. సోనూ రాహుల్ నుంచి డబ్బులు తీసుకున్నాడని, వారి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోందని సమాచారం. ఘటన జరిగిన రోజు రాహుల్ తన సోదరుడు హరీష్‌తో కలిసి సోనూను కలిసి డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగాడు.

ఇది ముగ్గురి మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఆ తర్వాత ఇద్దరు సోదరులు సోనును కొట్టారు. నిందితుడు సోను కడుపుపై ​​కత్తితో పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత సోనూ రోడ్డుపై కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సోనుని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story