దారుణం.. సైకిల్‌పై వెళ్లే వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీకొట్టాడని.. వెంటాడి వెంటాడి మరీ చంపారు.!
A man in UP Was brutally murdered. ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దారుణం చోటుచేసుకుంది. 30 ఏళ్ల ఓ వ్యక్తి తన వాహనంపై నియంత్రణ కోల్పోయి సైకిల్‌ను ఢీకొన్న తర్వాత కొట్టి
By అంజి Published on
6 Feb 2022 2:12 PM GMT

ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దారుణం చోటుచేసుకుంది. 30 ఏళ్ల ఓ వ్యక్తి తన వాహనంపై నియంత్రణ కోల్పోయి సైకిల్‌ను ఢీకొన్న తర్వాత కొట్టి చంపబడ్డాడు. బెర్వా పహర్‌పూర్ గ్రామంలో మున్షీ గౌతమ్ అనే వ్యక్తి మద్యం తాగి ట్రాక్టర్ నడుపుతుండగా.. స్పీడ్ బ్రేకర్‌పై నుంచి వెళ్లడంతో వాహనం అదుపు తప్పి సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై వెళ్లే వ్యక్తిని ఢీకొట్టాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని స్థానికులు పట్టుకుని కొట్టి చంపారు.
పోలీసు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. అతను తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వచ్చాడు.. కాని అతను చెట్టును ఢీకొట్టి రోడ్డుపై సైకిల్ మీద వెళ్లే వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో అతనిని స్థానికులు పట్టుకుని పాశవికంగా దాడి చేసారు. తరువాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఈ కేసులో జై శంకర్ పాండే అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి.. పాండేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
Next Story