మైనర్ బాలికపై లైంగిక దాడి.. 90 ఏళ్ల వృద్ధుడికి మూడేళ్ల జైలు శిక్ష

A Kerala court sentenced a 90-year-old man to three years in prison for sexually assaulting a minor girl. ఓ మైనర్‌ బాలికను లైంగిక వేధించాడో 90 ఏళ్ల వృద్ధుడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా కరింబా గ్రామంలో

By అంజి  Published on  1 Sept 2022 1:02 PM IST
మైనర్ బాలికపై లైంగిక దాడి.. 90 ఏళ్ల వృద్ధుడికి మూడేళ్ల జైలు శిక్ష

ఓ మైనర్‌ బాలికను లైంగిక వేధించాడో 90 ఏళ్ల వృద్ధుడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా కరింబా గ్రామంలో జరిగింది. వృద్ధుడు మైన‌ర్‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. తాజాగా ఈ కేసును విచారించిన కేరళ కోర్టు.. 90 ఏళ్ల వృద్ధుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు జడ్జి సతీష్‌ కుమార్‌ ఈ కేసు తీర్పు వెలువరించారు. వృద్ధుడికి జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించాడు. 2020లో పొరుగింట్లో ఉన్న 15 ఏళ్ల బాలికపై నిందితుడు లైంగిక దాడి చేశాడు.

ఈ నేపథ్యంలోనే పోక్సో చ‌ట్టంలోని సెక్ష‌న్ 7 ప్ర‌కారం వృద్ధుడికి శిక్ష వేసిన‌ట్లు స్పెష‌ల్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నిషా విజ‌య్‌కుమార్ తెలిపారు. సెక్ష‌న్ 7 ప్ర‌కారం మూడు నుంచి అయిదేళ్ల జైలు శిక్ష ప‌డ‌డం ఖాయం. తొమ్మిది మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ సమర్పించిన పలు డాక్యుమెంట్లను విచారించిన అనంతరం నిందితులను దోషులుగా కోర్టు నిర్ధారించిందని ఎస్పీపీ తెలిపారు.

Next Story