పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం.. హైదరాబాద్‌లో ఘటన

A Girl was raped by five people in hyderabad. హైదరాబాద్‌లోని హయతనగర్‌ మండల పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న

By అంజి
Published on : 29 Nov 2022 10:47 AM IST

పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం.. హైదరాబాద్‌లో ఘటన

హైదరాబాద్‌లోని హయతనగర్‌ మండల పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. తోటి విద్యార్థులే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తట్టి అన్నారంలోని వైఎస్ఆర్ కాలనీలో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న బాలిక.. స్థానికంగా ఉన్న ఓ స్కూల్‌లో టెన్త్‌ క్లాస్‌ చదువుతోంది.

ఈ క్రమంలోనే బాలికపై కన్నేసిన తోటి విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. బాలికపై ఐదుగురు విద్యార్థులు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసే సమయంలో రికార్డు చేశారు. ఎవరికైనా చెబితే సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరింపులకు గురి చేశారు. 10 రోజుల తర్వాత మరోసారి బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత అత్యాచారం వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై అత్యాచారం, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story