బాలికపై అత్యాచారం.. ఆపై అభ్యంతరకరస్థితిలో ఫ్యాన్‌కు వేలాడదీసి హత్య.!
A girl was raped and strangled to death in UP. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలిక బుధవారం భోగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో
By అంజి Published on 6 Oct 2022 2:21 PM ISTఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలిక బుధవారం భోగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి పని మీద వేరే ఊరికి వెళ్లాడు. ఘటన జరిగినప్పుడు ఆమె తల్లి ఆగ్రాకు వెళ్లింది. బాధితురాలి సోదరి కోచింగ్ సెంటర్ నుండి తిరిగి వచ్చినప్పుడు.. ఆమె సోదరి "అభ్యంతరకరమైన" స్థితిలో చున్నీతో వేలాడుతున్నట్లు గుర్తించింది. పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ), కమలేష్ దీక్షిత్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
బాలికపై అత్యాచారం జరిగినట్టు, నిందితుడు ఆమె గొంతు నులిమి, ఫ్యాన్‌కు వేలాడదీసి చంపినట్టు తెలుస్తోంది. కొన్ని నిమిషాల్లోనే స్థానికులు ఇంటి చుట్టూ చేరారు. పోలీసులకు సమాచారం అందించారు.
"నాగ్లా శిషామ్ గ్రామంలో బాలికపై అత్యాచారం, హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించాం" అని మెయిన్‌పురి ఎస్పీ కమలేష్ దీక్షిత్ తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రధాన మార్చురీకి తరలించారు. తన సోదరిని గొంతు నులిమి హత్య చేశాడని మృతుడి సోదరి ఆరోపించడంతో పుష్పేంద్ర అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
అంతకుముందు సెప్టెంబర్ 15న, లఖింపూర్ ఖేరీలో ఇద్దరు టీనేజ్ దళిత సోదరీమణులు అత్యాచారం, హత్యకు గురైన తర్వాత చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. బాలికలను పొలానికి రప్పించి సోహైల్, జునైద్‌లు అత్యాచారం చేశారు. నిందితులు తమను పెళ్లి చేసుకోవాలని బాలికలు డిమాండ్ చేయడంతో, సోహైల్, హఫీజుల్, జునైద్ గొంతుకోసి చంపారని, వారు కరీముద్దీన్, ఆరిఫ్‌లను పిలిచి ఎటువంటి రుజువు లేకుండా బాలికలను ఉరితీశారని ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు.