కోయంబత్తూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. పుటిన రోజున ప్రియుడితో మాట్లాడలేకపోయానంటూ ఓ 18 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరు ఇరుకూరైకి చెందిన ఓ తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని కుమార్తె 10వ తరగతిలో ఫెయిల్ అయింది. దీంతో తండ్రి తన కూతురిని తన సొంతూరైన సేలం జిల్లాలోని బాలిక నానమ్మ వద్దకు పంపాడు. ఈక్రమంలోనే ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొద్ది రోజుల తర్వాత తండ్రికి విషయం తెలిసింది. వెంటనే కూతురును కోయంబత్తూరుకి తీసుకెళ్లాడు.
ఈ నేపథ్యంలో ప్రేమికుడితో మాట్లాడలేక బాలిక మానసిక ఒత్తిడిలో ఉందని పోలీసులు తెలిపారు. ప్రియుడితో మాట్లాడటానికి సెల్‌ఫోన్ కూడా లేకపోవడంతో ఆమె చాలా డ్రిఫెషన్‌కు గురయ్యిందని సమాచారం. సోమవారం నాడు ఆమె పుట్టిన రోజు కావడంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పుట్టిన రోజున ప్రియుడితో మాట్లాడలేకపోయిన కారణంగా బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వివరించారు.