మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను ఆమె భర్త బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత ఆమె భర్త ఆమెను బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. బాధితురాలు సవితా సాకేత్ ఆదివారం రాత్రి భోజనం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. సవిత, ఆమె భర్త వీరేంద్ర సాకేత్.. సిద్ధి జిల్లాలోని ప్రభుత్వ పోలీసు క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే ఏదో విషయమై గొడవ జరగడంతో.. గొడవ మధ్యలోనే, వీరేంద్ర బేస్ బాల్ బ్యాట్ తీసుకొని తన భార్యను పదే పదే కొట్టాడని, ఫలితంగా ఆమె మరణించిందని సమాచారం. ఈ వివాదం వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.