Hyderabad: ఇంట్లో అగ్నిప్రమాదం.. ఊపిరాడక దంపతుల మృతి

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉంచిన పటాకులకు మంటలు అంటుకోవడంతో ఓ జంట ఉక్కిరిబిక్కిరి అయి మృతి చెందింది.

By అంజి  Published on  29 Oct 2024 12:36 PM IST
couple died, fire, Hyderabad

Hyderabad: ఇంట్లో అగ్నిప్రమాదం.. ఊపిరాడక దంపతుల మృతి

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉంచిన పటాకులకు మంటలు అంటుకోవడంతో ఓ జంట ఉక్కిరిబిక్కిరి అయి మృతి చెందింది. 15 ఏళ్ల అగ్నిప్రమాదంలో గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మృతి చెందిన దంపతులను హీరా మోహన్ లాల్, ఉషారాణిగా గుర్తించారు. సోమవారం అర్థరాత్రి యాకుత్‌పురాలోని రెయిన్‌బజార్‌లోని వారి ఇంట్లో దీపావళి పండుగ కోసం ఆహార పదార్థాలను సిద్ధం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

అకస్మాత్తుగా గ్యాస్ స్టవ్ నుండి నిప్పురవ్వలు క్రాకర్స్ బాక్స్‌పై పడటంతో రెండు గదుల ఇంటికి పొగ వ్యాపించడంతో దంపతులు ఊపిరాడక మరణించారని ప్రాథమిక విచారణలో తెలిపారు. మంటల కారణంగా నివాసంలో ఉంచిన పలు దీపావళి క్రాకర్లు కూడా పేలాయి. వృద్ధ దంపతులతో పాటు, ఇంట్లో ఉన్న 15 ఏళ్ల బాలిక శృతి కూడా ఊపిరాడక ఆసుపత్రిలో చేరిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story