10 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లి ఎదిరించడంతో..

A 38-year-old man sexually assaulted a minor girl in Punjab. పంజాబ్‌లోని లూథియానా దారుణం చోటు చేసుకుంది. 38 ఏళ్ల వ్యక్తి తన లైవ్-ఇన్ పార్ట్‌నర్‌ యొక్క 10 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి

By అంజి  Published on  12 Jan 2022 11:52 AM IST
10 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లి ఎదిరించడంతో..

పంజాబ్‌లోని లూథియానా దారుణం చోటు చేసుకుంది. 38 ఏళ్ల వ్యక్తి తన లైవ్-ఇన్ పార్ట్‌నర్‌ యొక్క 10 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తన భర్త ఆరేళ్ల క్రితం తనను విడిచిపెట్టాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మహిళ పేర్కొంది. అప్పటి నుండి తన కూతురిని తన వద్దే ఉంటోందని చెప్పింది. డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పరస్పర ఒప్పందం తర్వాత, వారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించారు. కొన్ని నెలల క్రితం నిందితుడు ఉద్యోగం కోల్పోయి.. ఇంటి వద్ద కాలక్షేపం చేయడం ప్రారంభించాడు. దీంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత మైనర్‌ బాలిక తల్లిపై పడింది.

ఈ క్రమంలోనే సోమవారం మైనర్‌ బాలిక తల్లి కూలీకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. నిందితుడు తనపై అత్యాచారం చేశాడని, సంఘటన ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని తల్లికి కుమార్తె చెప్పింది. ఆ మహిళ నిందితుడిని ఎదిరించడంతో అతడు ఆమెను దుర్భాషలాడుతూ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసినట్లు మోతీ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఇన్‌స్పెక్టర్ రవీందర్ కుమార్ తెలిపారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

Next Story