'చావు చాలా అందమైనది, ఈ భూమిపై మళ్లీ పుట్టాలనుకోవడం లేదు'..హీలియం గ్యాస్ పీల్చి CA సూసైడ్
ఢిల్లీలో ఓ యువ చార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది.
By Knakam Karthik
'చావు చాలా అందమైనది, ఈ భూమిపై మళ్లీ పుట్టాలనుకోవడం లేదు'..హీలియం గ్యాస్ పీల్చి CA సూసైడ్
ఢిల్లీలో ఓ యువ చార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. గురుగ్రామ్‌లోని ఒక కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి ఢిల్లీ ప్రాంతంలోని ఎయిర్‌బిఎన్‌బి ఫ్లాట్‌లో హీలియం వాయువు పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ధీరజ్ కన్సల్ అనే వ్యక్తి జూలై 20 నుండి 28 వరకు ఎనిమిది రోజుల పాటు ఫ్లాట్‌ను బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడే ఉంటూ IndiaMART వెబ్‌సైట్‌లో హీలియం గ్యాస్ కోసం సెర్చ్ చేశాడు. తర్వాత ఘజియాబాద్‌లోని ఒక సరఫరాదారు నుండి రూ.3,500కి హీలియంను పొందాడు.
అయితే ఆత్మహత్యకు ముందు ధీరజ్ కన్సల్ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్టు రాశాడు. "మరణం నాకు జీవితంలో అత్యంత అందమైన భాగం. దయచేసి నా మరణం గురించి బాధపడకండి. ఆత్మహత్య తప్పు కాదు ఎందుకంటే నాకు నాపై ఎటువంటి బాధ్యతలు లేవు. నా నిర్ణయం పట్ల ఎవరినీ నిందించకండి. "ఇది నా ఒక్కడి ఎంపిక. నా జీవితంలో నేను కలిసిన ప్రతి ఒక్కరూ నా పట్ల నిజంగా దయతో ఉన్నారు. కాబట్టి దయచేసి దీని కారణంగా ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని నేను పోలీసులను, ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను" అని అన్నారు.
ఈ భూమిపై మళ్ళీ పుట్టాలని కోరుకోవడం లేదు. నన్ను నేను ద్వేషించుకుంటున్నా, నేను ఓడిపోయిన వ్యక్తి..అని రాసుకొచ్చాడు. నా మరణం పట్ల అందరూ బాధపడవద్దు, నాకు ఎలాంటి పెద్ద బాధ్యతలు లేవు, ఎవరితోనూ పెద్దగా భావోద్వేగపరంగా అనుబంధం లేదు..అని రాసుకొచ్చాడు.