హైదరాబాద్‌లో దారుణం.. రక్తపు మడుగులో మృతదేహం
హైదరాబాద్: పటాన్ చెరువు ముంబై 65 జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 13 Sept 2023 12:53 PM ISTహైదరాబాద్‌లో దారుణం.. రక్తపు మడుగులో మృతదేహం
హైదరాబాద్: పటాన్ చెరువు ముంబై 65 జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. లక్డారం గ్రామ సమీపంలో ఓ వ్యక్తి రక్తం మడుగులో పడి ఉండడం గమనించిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు రౌడీ షీటర్ నజీర్ అహ్మద్‌గా గుర్తించారు. డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున 2:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సమాచారం. పటాన్‌చెరువు పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
బాధితుడు.. పాతబస్తీ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌లో నివాసముంటున్నాడు. గత 2 సంవత్సరాల క్రితం జహీరాబాద్‌లో జరిగిన విశాల్ షిండే హత్య కేసులో నజీర్ అహ్మద్ నిందితుడి గా ఉన్నాడు. విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ తో సహా 7 మంది సభ్యులు ఉన్నారు. నజీర్ అహ్మద్ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ గా చలామణి అవుతున్నాడు. నజీర్‌ని ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఐపీసీ సెక్షన్ 302 ( హత్యకు శిక్ష ) కింద కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు.
సెప్టెంబర్ 10న, పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ యజమాని, సిబ్బంది అదనపు రైతా (పెరుగు) అడిగినందుకు గొడవపడి ఒక కస్టమర్‌ను కొట్టి చంపారు . బాధితుడు మహ్మద్ లియాఖత్ (31) చాంద్రాయణగుట్టలోని హష్మతాబాద్‌లో నివసిస్తున్నాడు, ఆదివారం రాత్రి 11 గంటలకు తన స్నేహితుడితో కలిసి విందు కోసం రెస్టారెంట్‌కు వచ్చాడు.