8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. 8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 28 Sept 2023 9:41 AM IST8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. 8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిదేళ్ల బాలికపై తొమ్మిదేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు గురువారం తెలిపారు. “కేసు నమోదు చేయబడింది. మైనర్ బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. బాలుడు తదుపరి చర్యను నిర్ణయించడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని శిశు సంక్షేమ కమిటీ కోసం ఎదురు చూస్తున్నాడు”అని ఎస్‌హెచ్‌వో అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.
పీజీఐ సమీపంలోని అర్జున్‌గంజ్ సిగ్నల్‌ల వద్ద అమ్మాయి అడుక్కుంటుందని, అబ్బాయి సుశాంత్ గోల్ఫ్ సిటీ సమీపంలో నివసిస్తూ వీధుల్లో బెలూన్‌లు విక్రయిస్తుంటాడని, ఇద్దరూ ఒకరికొకరు తెలుసునని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి ఆ ప్రాంతంలో నిర్వహించిన జాతరకు వచ్చారు. "తర్వాత బాలుడు బాలికను ఏకనా స్టేడియం వెనుక ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు" అని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. అమ్మాయి తన తండ్రికి సమాచారం అందించింది, ఆపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంఘటన తర్వాత నిందితుడు పారిపోయాడు. అయితే వెంటనే పోలీసులు అతడిని పట్టుకున్నారు.