పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది కార్మికులు దుర్మ‌ర‌ణం

చెన్నైలోని ఎన్నూర్‌లో థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి.

By -  Medi Samrat
Published on : 30 Sept 2025 8:23 PM IST

పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది కార్మికులు దుర్మ‌ర‌ణం

చెన్నైలోని ఎన్నూర్‌లో థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో వ‌ల‌స కార్మికులు ఎన్నూరులో ఉంటూ పని చేస్తున్నారు. ఈరోజు కార్మికులు పనిలో ఉండ‌గా.. ముఖద్వారంపై అమర్చిన సారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇందులో 9 మంది ఉత్తర రాష్ట్ర కూలీలు మృతి చెందడం విషాదాన్ని నింపింది. జెయింట్ ఆర్చ్ నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులు మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడి చెన్నై రాయపురం స్టాన్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story