దారుణం.. మద్యం బాటిల్‌ కోసం.. వృద్ధుడిని చంపిన 8 మంది బాలికలు

8 girls killed an old man for a bottle of liquor. ఎనిమిది మంది టీనేజ్ అమ్మాయిలు కలిసి 59 ఏళ్ల వృద్ధుడిని హత్య చేశారు. మద్యం బాటిల్ కోసం బాలికలు ప

By అంజి  Published on  23 Dec 2022 2:17 PM IST
దారుణం.. మద్యం బాటిల్‌ కోసం.. వృద్ధుడిని చంపిన 8 మంది బాలికలు

ఎనిమిది మంది టీనేజ్ అమ్మాయిలు కలిసి 59 ఏళ్ల వృద్ధుడిని హత్య చేశారు. మద్యం బాటిల్ కోసం బాలికలు పదునైన ఆయుధంతో వృద్ధుడిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ దారుణ హత్యలో పాల్గొన్న ఎనిమిది మంది బాలికల్లో ముగ్గురికి పదమూడు, ముగ్గురికి పద్నాలుగు, మరో ఇద్దరికి పదహారేళ్లు ఉన్నాయని విచారణలో తేలింది. వీరంతా సోషల్ మీడియాలో కలిశారని పోలీసులు తెలిపారు. అయితే విచారణకు సంబంధించిన చాలా విషయాలు పోలీసులు బయటపెట్టలేదు.

కెనడాలోని టొరంటోలో డిసెంబర్ 18న వెలుగు చూసిన ఈ కేసులో.. హత్యకు గురైన వృద్ధుడు ఎవరనే విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించలేదు. గాయపడిన వృద్ధుడిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు ప్రకటించారు. ప్రాథమిక విచారణలో హత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. 59 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఘటనలో ఎనిమిది మంది టీనేజ్ బాలికలపై హత్యానేరం మోపినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 29న ఈ అమ్మాయిలందరినీ కోర్టులో హాజరుపరచనున్నారు. అక్కడ వారిపై కేసు విచారణ ప్రారంభమవుతుంది.

టొరంటో పోలీస్ సర్వీస్ హోమిసైడ్ విభాగానికి చెందిన డిటెక్టివ్ సార్జెంట్ టెర్రీ బ్రౌన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ బాలికలందరూ నగరంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చి సోషల్ మీడియాలో కలిశారని చెప్పారు. వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన జరుగుక ముందే ఈ బాలికలు వేరొకరిని టార్గెట్ చేసి ఉండొచ్చని తెలిపారు. ఈ హత్య తర్వాత పోలీసులు కూడా బిత్తరపోయారు. అమ్మాయిల ప్రవర్తన గుంపులుగా దాడి చేసే నేరస్థులలా ఉందని చెప్పారు. ప్రస్తుతం 8 మంది అమ్మాయిలు జైలులో ఉన్నారు.

Next Story