టాక్సీ కాలువలో పడి 8 మంది దుర్మ‌ర‌ణం

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది.

By Medi Samrat
Published on : 15 July 2025 8:10 PM IST

టాక్సీ కాలువలో పడి 8 మంది దుర్మ‌ర‌ణం

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బ్రిడ్జికి 300 మీటర్ల దిగువన ఉన్న కాలువలో పడిపోవడంతో ఎనిమిది మంది మరణించారు, నలుగురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. మువానీ పట్టణంలోని సుని బ్రిడ్జి సమీపంలో 13 మంది ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై 8 మంది మృతి చెందినట్లు పితోర్‌గఢ్ ఎస్పీ రేఖా యాదవ్ సమాచారం అందించారు. పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

మృతుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగం, సహాయ, రెస్క్యూ బృందాలను ఆదేశించారు. క్షతగాత్రులకు సకాలంలో ఉచితంగా వైద్యం అందించాలని కోరారు.

Next Story