నాటు బాంబు పేలి 7 ఏళ్ల బాలుడు మృతి

7-year-old killed in crude bomb blast in Bengal's Burdwan. పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. నాటు బాంబు పేలి ఏడేళ్ల చిన్నారి మరణించాడు.

By Medi Samrat  Published on  22 March 2021 12:35 PM GMT
7-year-old killed in crude bomb blast in Bengals Burdwan

పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. నాటు బాంబు పేలి ఏడేళ్ల చిన్నారి మరణించాడు. వివ‌రాళ్లోకెళితే.. షేక్ అఫ్రోజ్, షేక్ ఇబ్రహీం అనే ఇద్దరు చిన్నారులు తమ ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. స‌మీపంలో ఉన్న‌ ఓ పొట్లాన్ని చిన్నారులు తాకగా.. అందులోని నాటు బాంబు పేలి వారికి తీవ్ర గాయాలయ్యాయి.

పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన స్థానికులు చిన్నారులను ఇద్దరినీ హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే.. అఫ్రోజ్(7) అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన‌ ఇబ్రహీం ప్రస్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. రాష్ట్రంలో మ‌రికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జ‌ర‌గ‌డం తీవ్ర‌ కలకలం రేపుతోంది.


Next Story
Share it