ఏడేళ్ల బాలికపై టాయ్స్‌ సేల్స్‌మెన్‌ లైంగిక వేధింపులు

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. వీ3ఎస్ మాల్‌లో ఏడేళ్ల బాలికపై బొమ్మల దుకాణం

By అంజి  Published on  2 May 2023 6:00 PM IST
Delhi , Crime news, ShoppingMall

ఏడేళ్ల బాలికపై టాయ్స్‌ సేల్స్‌మెన్‌ లైంగిక వేధింపులు

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. వీ3ఎస్ మాల్‌లో ఏడేళ్ల బాలికపై బొమ్మల దుకాణం సేల్స్‌మెన్ వేధింపులకు పాల్పడ్డాడని పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. నిందితుడిని సరితా విహార్‌కు చెందిన ధీరజ్ కుమార్ (30)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ నగర్ సమీపంలోని వీ3ఎస్ మాల్‌లోని బొమ్మల దుకాణంలో మైనర్ బాలికపై సేల్స్‌మెన్ ఒకరు వేధింపులకు పాల్పడినట్లు పీసీఆర్ కాల్ ఏప్రిల్ 30 న అందింది.

“అమ్మాయి తన అమ్మమ్మతో కలిసి మాల్‌కి వచ్చినట్లు విచారణలో తేలింది. అమ్మమ్మ వాష్‌రూమ్‌కు వెళ్లగా, బాలిక బొమ్మల దుకాణంలోకి ప్రవేశించింది, అక్కడ నిందితులు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు”అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 7 ఏళ్ల బాలికకు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ నుండి కౌన్సెలింగ్ అందించబడింది. ఆమెకు హెడ్గేవార్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా చేశారు. "ఐపిసి సెక్షన్ 354 మరియు 10 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడు ధీరజ్‌ను మాల్ నుండి పట్టుకున్నారు" అని అధికారి తెలిపారు.

Next Story