ఇండోర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఏడుగురు సజీవ దహనం

7 Charred to death after massive fire breaks out at Two storey building in Indore.శ‌నివారం తెల్ల‌వారుజామున ఓ బిల్డింగ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2022 5:53 AM GMT
ఇండోర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఏడుగురు సజీవ దహనం

శ‌నివారం తెల్ల‌వారుజామున ఓ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతి చెంద‌గా.. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఇండోర్‌లోని స్వ‌ర్ణ‌బాగ్ కాల‌నీలో గ‌ల ఓ రెండ‌త‌స్తుల భ‌వ‌నంలోని బేస్‌మెంట్లో తెల్ల‌వారుజామున 3.10 గంట‌ల‌కు విద్యుత్తు బోర్డులో షార్ట్ స‌ర్క్యూట్ అయ్యి మంట‌లు చెల‌రేగాయి. పార్కింగ్‌లో నిలిపి ఉంచిన వాహ‌నాలు మంట‌లు అంటున్నాయి. అవి క్ర‌మంగా భ‌వ‌నం మొత్తం వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. అప్ప‌టికే ఏడుగురు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. మ‌రో ఐదుగురికి తీవ్ర‌గాయాలు కాగా.. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ఫైర్ సేప్టీ ప‌రిక‌రాలు భ‌వ‌నంలో అందుబాటులో లేక‌పోవ‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఇంటి ఓన‌ర్ అన్స‌ర్ ప‌టేల్‌ను అరెస్ట్ చేశారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలియ‌జేశారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


Next Story