కామారెడ్డి జిల్లాలో దారుణం.. డబ్బుల కోసం కుమార్తెల అమ్మకం

7 arrested for attempting to sell minor girls in Kamareddy. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా మంచారెడ్డి గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది.

By అంజి
Published on : 25 Jan 2023 11:01 AM IST

కామారెడ్డి జిల్లాలో దారుణం.. డబ్బుల కోసం కుమార్తెల అమ్మకం

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా మంచారెడ్డి గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. డబ్బుల కోసం ఓ సవతి తల్లి, తండ్రి దారుణానికి ఒడిగట్టారు. తమ మైనర్‌ కూతుళ్లును అమ్మారు. వారిని కొనుక్కున్న రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. వారిని వివాహం చేసుకున్నారు. కవలలైన అక్కా చెల్లెళ్లకు చిన్నతనంలో తల్లి చనిపోయింది. ఆ తర్వాత తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లికి ఇద్దరు పిల్లలు పుట్టడంతో.. తండ్రికి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో కవల కూతుళ్లకు 14 ఏళ్ల వయస్సు రాగానే రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులకు అమ్మేశారు.

అయితే వారిని కొన్న వారు.. బాలికలపై దారుణాలకు పాల్పడ్డారు. పెళ్లి చేసుకుని ఇద్దరికి నరకం చూపారు. భర్త చెర నుంచి తప్పించుకున్న బాలికల్లో చిన్న అమ్మాయి జిల్లా సంక్షేమాధికారికి తమ బాధను చెప్పుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. తనలాగే తన సోదరిని కూడా అమ్మేశారని చెప్పింది. దీంతో దర్యాప్తు జరిపి ఇద్దరు మైనర్ బాలికలను అమ్మేందుకు ప్రయత్నించిన సవతి తల్లి, తండ్రి సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి పోలీసులు మైనర్ బాలికల తల్లిదండ్రులతో పాటు వారిని విక్రయించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బాలికల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Next Story