ఈ ముస‌లోడు మామూలోడు కాదు.. ప్రియురాలితో పారిపోయేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌

65 Year old Man kills labourer in Pune.వివాహేత‌ర సంబంధాల మోజులో ప‌డి ఎంత‌టి దారుణాల‌కైనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Dec 2022 4:25 AM GMT
ఈ ముస‌లోడు మామూలోడు కాదు.. ప్రియురాలితో పారిపోయేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌

వివాహేత‌ర సంబంధాల మోజులో ప‌డి ఎంత‌టి దారుణాల‌కైనా తెగిస్తున్నారు కొంద‌రు. త‌మ జీవితాల‌ను నాశ‌నం చేసుకోవ‌డంతో పాటు ఎదుటివారిని క‌డ‌తేర్చేందుకు వెన‌కాడ‌డం లేదు. ఓ వృద్దుడు ఓ మ‌హిళ‌తో వివాహేత‌రం సంబంధం ఏర్ప‌ర‌చుకున్నాడు. ఆమెతో పారిపోయేందుకు ఓ వ్య‌క్తిని హ‌త్య చేశాడు. చ‌నిపోయింది తానేన‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలో చోటు చేసుకుంది.

ఛబాన్ థోర్వే అలియాస్ సుభాష్ అనే 65 ఏళ్ల ఓ వృద్ధుడు పూణేలోని ఖేడ్ జిల్లాలో నివ‌సించేవాడు. ఇత‌డికి ఓ మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఈ విష‌యం ఎప్ప‌టికైనా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని బావించాడు. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే తన ప్రియురాలితో పారిపోవాల‌ని అనుకున్నాడు. పారిపోతే విష‌యం అంద‌రికి తెలుస్తుంది క‌నుక తాను చ‌నిపోయిన‌ట్లు అంద‌రిని న‌మ్మించాల‌ని ప‌థ‌కం ప‌న్నాడు. అందులో భాగంగా త‌న‌కు తెలిసిన 45 ఏళ్ల రవీంద్ర భీమాజీ ఘెనంద్ ను డిసెంబ‌ర్ 16న హ‌త‌మార్చాడు.

అనంత‌రం త‌ల‌ను మొండెం నుంచి వేరు చేశాడు. మొండానికి త‌న దుస్తులు, ఇంకా త‌న‌కు సంబంధించిన వ‌స్తులు వేసి త‌న పొలంలో ప‌డేశాడు. ఇక చనిపోయింది తానేన‌ని అంద‌రూ అనుకుంటార‌ని బావించాడు. మొండెం లేక‌పోవ‌డంతో అత‌డు అనుకున్న‌ట్లే చ‌నిపోయింది సుభాషేన‌ని అత‌డి కుటుంబ స‌భ్యులు న‌మ్మారు. అంత్య‌క్రియ‌లు కూడా పూర్తి చేశారు.

దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీ కెమెరాలు ప‌రిశీలించ‌గా అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మ‌ర‌ణించింది సుభాష్ కాదని, రవీంద్ర భీమాజీ అని గుర్తించారు. సుభాష్‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా హ‌త్య చేసింది తానేన‌ని అంగీక‌రించాడు.

Next Story