గాంధీ ఆస్పత్రి 6వ అంతస్తు పైనుంచి దూకి వృద్ధుడు ఆత్మ‌హ‌త్య‌

60-year-old man jumps from 6th floor of Gandhi Hospital. హైదరాబాద్‌లో శుక్రవారం 60 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat  Published on  6 May 2022 9:00 PM IST
గాంధీ ఆస్పత్రి 6వ అంతస్తు పైనుంచి దూకి వృద్ధుడు ఆత్మ‌హ‌త్య‌

హైదరాబాద్‌లో శుక్రవారం 60 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివ‌రాళ్లోకెళితే.. గాంధీ ఆస్పత్రిలోని 6వ అంతస్తు పైనుంచి దూకి వృద్ధుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. చ‌నిపోయిన వృద్దుడిని కొమరయ్యగా గుర్తించారు. కొమరయ్య భార్య కడుపు నొప్పితో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరింది. కొమరయ్య తన భార్యకు సాయంగా వచ్చినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అయితే వృద్ధుడి మ‌ర‌ణానికి కుటుంబ సభ్యుల మధ్య గొడవలే కారణమని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శవపరీక్ష విభాగానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.









Next Story