ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, డీసీఎం వ్యాన్‌ ఢీ.. ఆరుగురు మృతి

6 People Killed in Road Accident in Maharashtra. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, డీసీఎం వ్యాన్‌ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అ

By అంజి  Published on  14 Aug 2022 1:33 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, డీసీఎం వ్యాన్‌ ఢీ.. ఆరుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, డీసీఎం వ్యాన్‌ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బీడ్‌ జిల్లాలోని మంజార్‌సంబా - పటోడా హైవేపై ఉదయం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. కేజ్ తహసీల్‌లోని జివాచివాడి గ్రామానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో పూణెకు వెళ్తుండగా వారి వాహనం, డీసీఎం వ్యాన్‌ ఒకదానికొకటి ఢీకొన్నాయని పోలీసు అధికారి తెలిపారు. కుటుంబానికి చెందిన ఐదుగురు, మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారి తెలిపారు. రెండు వాహనాలను వేరు చేసేందుకు పోలీసులు క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చిందని తెలిపారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Next Story