నిజామాబాద్‌లో ఆరు నెలల బాలుడు కిడ్నాప్‌

6-month-old boy kidnapped in Nizamabad. నిజామాబాద్‌లో ఆరు నెలల బాలుడిని కొందరు గుర్తుతెలియని మహిళలు కిడ్నాప్ చేసిన

By Medi Samrat
Published on : 7 May 2022 3:30 PM IST

నిజామాబాద్‌లో ఆరు నెలల బాలుడు కిడ్నాప్‌

నిజామాబాద్‌లో ఆరు నెలల బాలుడిని కొందరు గుర్తుతెలియని మహిళలు కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం రేపింది. నిజామాబాద్‌లోని వినాయకనగర్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన.. బిక్షాట‌న చేస్తూ జీవ‌నం గ‌డిపే చిన్నారి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం.. కొంతమంది గుర్తుతెలియని మహిళలు.. శిశువుకు బట్టలు ఇస్తామని చెప్పి అతని తల్లి నుండి శిశువును తీసుకున్నారు. వారి మాటలు నమ్మిన తల్లి తన ఆరు నెలల బాబును వారికి అప్పగించగా.. వారు తన బిడ్డతో పారిపోయినట్లు గుర్తించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సాయంతో కేసు దర్యాప్తు చేసి బాలుడి ఫొటోను విడుదల చేశారు.














Next Story