ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ట్ర‌క్కును ఢీ కొన్న బ‌స్సు.. 6 గురు దుర్మ‌ర‌ణం

6 Killed bus collide with truck in Firozabad.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2022 1:32 PM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ట్ర‌క్కును ఢీ కొన్న బ‌స్సు.. 6 గురు దుర్మ‌ర‌ణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఫిరోజాబాద్ స‌మీపంలోని ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై డీసీఎంను ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెంద‌గా మ‌రో 21 మంది గాయపడ్డారు.

పంజాబ్‌లోని లూథియానా నుంచి 50 మంది ప్రయాణికులతో బస్సు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి బ‌య‌లుదేరింది. నాగ్లా ఖంగార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 4.30 గంటల స‌మ‌యంలో బస్సును ట్ర‌క్కును ఢీ కొట్టింది. అనంత‌రం బోల్తా ప‌డింది. ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

స్వల్ప గాయాలతో ఉన్న ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డిన 19 మంది ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించిన తర్వాత మరో బస్సులో వారి గమ్యస్థానానికి పంపించామని, ఆరుగురు అక్కడికక్కడే మరణించారని ఎస్పీ రణవిజయ్ సింగ్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ ప్ర‌మాదంపై ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. క్ష‌త‌గాత్రుల కుటుంబాల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Next Story