మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా ఉదయం గన్‌పౌడర్ పేలుడుతో దద్దరిల్లింది. ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. అగ్ని జ్వాలలు, పొగ మేఘాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయి ఉంటారని భయాందోళన చెందుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఫ్యాక్టరీలో 500 నుంచి 700 మంది పనిచేస్తున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.
భోపాల్‌లోని జేపీ హాస్పిటల్‌లో 6 పడకల వార్డును సిద్ధం చేశారు. చికిత్స కోసం వైద్యులు కూడా వచ్చారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై హర్దా కలెక్టర్ రిషి గార్గ్ మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురు మృతి చెందారని, మరో 59 మంది గాయపడ్డారని.. గాయపడిన వారు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన రోగులను భోపాల్, ఇండోర్‌లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.