ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీ.. ఐదుగురు మృతి
5 Killed Several Injured in Bus-truck Collision in Jodhpur. జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2023 11:14 AM IST
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా మరో 32 మందికి గాయాలయ్యాయి.
జోథ్‌పూర్ నుంచి ప్రయాణీకులతో బస్సు ఒసియన్‌కు బయలుదేరింది. శుక్రవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో మథానియా రోడ్డులో బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. అదే రోడ్డు పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు వెంటనే స్పందించారు. బస్సు అద్దాలు పగుల కొట్టి అందులో ఉన్న ప్రయాణీకులు బయటకు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు వాహనాల క్యాబిన్లలో ఇరుక్కు వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులను బన్వర్‌లాల్(24), క్రిష్ణా రామ్(38), ఖాన్ సింగ్(30), బాటి(75)లుగా గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది.
जोधपुर के एमडीएम अस्पताल पहुंचकर मथानिया क्षेत्र में हुई सड़क दुर्घटना में घायल हुए लोगों की कुशलक्षेम जानी एवं प्रशासन को बेहतर इलाज के लिए निर्देशित किया। इस हादसे में जान गंवाने वाले सभी दिवंगतों की आत्मा की शान्ति एवं घायलों के जल्द स्वास्थ्य लाभ की कामना करता हूं। pic.twitter.com/n8L2TqjujO
— Ashok Gehlot (@ashokgehlot51) January 6, 2023
ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. వారిని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరి ఆత్మలకు శాంతి కలగాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.