రోడ్డు ప్రమాదాలు కట్టడి కావడం లేదు. నిత్యం ఏదో మూలన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు బీద్-పర్లీ హైవేపై భీభత్సం సృష్టించింది. ట్రక్కు వేగంగా దూసుకొచ్చి ఆటో, బైకు, మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఐదుగురు మృతిచెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మద్వానీ నుంచి బీడ్ వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మరో మోటార్ సైకిల్‌ను ఓ ఫోర్ వీలర్‌ను గుద్దింది. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న ఓ గుంతలో పడిపోయింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
గాయపడ్డవారిలో ఐదుగురు ఆటలో ప్రయాణిస్తున్నవారు కాగా, ఇద్దరు ఫోర్ వీలర్, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.