అదుపుతప్పి లోయలో పడ్డ కారు.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

5 killed in Jammu and Kashmir road accident. శనివారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘరో ప్రమాదం జరిగింది. ఆరుగురు ప్రయాణిస్తున్న కారు

By అంజి  Published on  5 March 2022 2:24 PM IST
అదుపుతప్పి లోయలో పడ్డ కారు.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

శనివారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘరో ప్రమాదం జరిగింది. ఆరుగురు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రగాయపడ్డారు. మన్సార్‌ సమీపంలోని జమోదా సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు సాంబా నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా జిల్లాలోని జమోదా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న కారు లోతైన లోయలో పడింది. వాహనంలోని ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. "JK01U-2233 రిజిస్ట్రేషన్ నంబర్ గల కారు లోయలోని అనంత్‌నాగ్ జిల్లా నుండి ప్రయాణీకులను తీసుకువెళుతోంది" అని పోలీసులు తెలిపారు.

గాయపడిని వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కారులో చిక్కుకున్న ఐదు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయని పోలీసులు తెలిపారు. కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, ఆ తర్వాత అది లోయలోకి బోల్తా పడిందని అధికారులు తెలిపారు. మృతులను గుల్జార్ అహ్మద్ భట్ (71), అతని భార్య జైనా బేగం (65), వారి కుమారుడు ఇక్బాల్ అహ్మద్ భట్ (25), కుమార్తె మస్రత్ జాన్ (21)గా గుర్తించారు. డ్రైవర్‌ను అనంత్‌నాగ్ నివాసి సాకిబ్‌గా గుర్తించారు.

Next Story