Video: కెమికల్ ట్యాంకర్ పేలి ఐదుగురు సజీవ దహనం
రాజస్థాన్ రాష్ట్రం యాపూర్-అజ్మీర్ హైవేపై కెమికల్ ట్యాంకర్ పేలుడు సంభవించడంతో పలువురు సజీవ దహనమయ్యారు.
By అంజి Published on 20 Dec 2024 3:57 AM GMTVideo: కెమికల్ ట్యాంకర్ పేలి ఐదుగురు సజీవ దహనం
రాజస్థాన్ రాష్ట్రం యాపూర్-అజ్మీర్ హైవేపై కెమికల్ ట్యాంకర్ పేలుడు సంభవించడంతో పలువురు సజీవ దహనమయ్యారు. శుక్రవారం ఉదయం రసాయనంతో ఉన్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు ఇతర వాహనాలను ఢీకొనడంతో 20 వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారని భంక్రోటా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మనీష్ గుప్తా తెలిపారు. కాలిన గాయాలతో ఉన్న కొంత మందిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పెట్రోలు పంపు ముందు ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
ట్యాంకర్‌లో పేలుడు సంభవించడంతో ఆ రసాయనం రోడ్డుపై దాదాపు 500 మీటర్ల మేర వ్యాపించింది. దీంతో పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. రసాయనాల కారణంగా ఓ ఫ్యాక్టరీ కూడా కాలిపోయింది. రసాయనాలు, గ్యాస్ కారణంగా మంటలను ఆర్పడానికి అగ్నిమాపక బృందం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెస్క్యూ సభ్యులు మాస్క్‌లు ధరించి ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో భాంక్రోటా ప్రాంతంలో పెద్ద చప్పుడు వినిపించింది. రసాయనాలు నింపిన ట్యాంకర్ పేలిన ప్రాంతానికి ఎదురుగా పెట్రోల్ పంపు, ఓ వైపు డీపీఎస్ స్కూల్ ఉన్నాయి. ఉదయం సమయం కావడంతో ఎక్కువ రద్దీ లేకపోవడం విశేషం.
VIDEO | Rajasthan: A gas tanker caught fire on Ajmer Road in #Jaipur earlier today. Several vehicles were also gutted in fire. More details are awaited.#JaipurNews (Full video available on PTI videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/kIJcm3AQRJ
— Press Trust of India (@PTI_News) December 20, 2024