Video: ఘోర ప్రమాదం.. అతివేగంతో నదిలో పడిన XUV700.. ఐదుగురు స్పాట్ డెడ్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నుంచి వేగంగా వస్తున్న XUV700 కారు మాహి నది సమీపంలోని గుంటలో పడిపోవడంతో ఐదుగురు మరణించారు.

By -  Knakam Karthik
Published on : 14 Nov 2025 3:55 PM IST

Crime News, National News, Delhi–Mumbai Expressway, 5 Dead

Video: ఘోర ప్రమాదం, అతివేగంతో నదిలో పడిన XUV700..ఐదుగురు స్పాట్ డెడ్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నుంచి వేగంగా వస్తున్న XUV700 కారు మాహి నది సమీపంలోని గుంటలో పడిపోవడంతో ఐదుగురు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం 7:30 గంటల ప్రాంతంలో రత్లాంలోని రావ్టి తహసీల్, భీమ్‌పురా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మహి నది వంతెన వద్దకు కొద్దిసేపటి ముందు వేగంగా వస్తున్న కారు రెయిలింగ్‌ను వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం లోయలో పడిపోయిన దృశ్యాలు ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న CCTV కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారు అహ్మదాబాద్, ముంబై నివాసితులు అని పోలీసులు తెలిపారు. మృతులను ముంబైలోని కుర్లాకు చెందిన ఇషాక్ చౌదరి కుమారుడు గులాం రసూల్ (70), వడోదరకు చెందిన గులాం రసూల్ చౌదరి కుమారుడు ఖలీస్, ముంబైలోని కుర్లాకు చెందిన డానిష్ చౌదరి కుమారుడు అబ్దుల్ గులాం, ముంబైలోని కుర్లాకు చెందిన ఉస్మాన్ చౌదరి కుమారుడు డానిష్ (15), దుర్గేష్ ప్రసాద్ (35) గా గుర్తించారు.

వాహనం నుండి మృతదేహాలను వెలికితీయడంలో స్థానికులు పోలీసులకు సహాయం చేశారు. మృతదేహాలను రత్లాంలోని డాక్టర్ లక్ష్మీ నారాయణ్ పాండే ప్రభుత్వ వైద్య కళాశాలకు పంపారు, బాధితుల కుటుంబాలు వచ్చిన తర్వాత పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహిస్తారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story