కుటుంబ కలహాలు.. 40 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపిన బంధువులు
40-year-old man shot dead over family dispute in Ghazipur. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌లో కుటుంబ వివాదం కారణంగా 40 ఏళ్ల వ్యక్తిని అతని బంధువులు అతని ఇంట్లోనే కాల్చి చంపినట్లు
By అంజి Published on 8 Feb 2022 6:54 AM GMTతూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌లో కుటుంబ వివాదం కారణంగా 40 ఏళ్ల వ్యక్తిని అతని బంధువులు అతని ఇంట్లోనే కాల్చి చంపినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు. నిందితుడు ఆకాష్ (20) మృతుడి మేనత్త కుమారుడు, మృతుడి మేనమామ కుమారుడని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాతికేళ్ల క్రితం తన తండ్రి మరణం వెనుక బాధితుడి హస్తం ఉందని నిందితుడు అనుమానిస్తున్నాడని, అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకే తన బంధువును హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దాడి వెనుక కచ్చితమైన ఉద్దేశ్యాన్ని తెలుసుకునేందుకు తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) ప్రియాంక కశ్యప్ మాట్లాడుతూ.. "మాకు సుధీర్ అనే వ్యక్తి ద్వారా ఘాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో పిసిఆర్ కాల్ వచ్చింది, అతని సోదరుడు సునీల్ కుమార్ తలపై కుడి వైపున బుల్లెట్ గాయం తగిలిందని తెలియజేశాడు." కాలర్‌ను ఉటంకిస్తూ.. ఇక్కడ ఘరోలీ ఎక్స్‌టెన్షన్‌లో నివాసం ఉంటున్న వారి ఇతర బంధువు విశాల్‌తో కలిసి సునీల్ బంధువు ఆకాష్ కాల్పులు జరిపినట్లు డిసిపి తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, గాయపడిన వ్యక్తిని ఎల్‌బిఎస్ ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని ఆమె చెప్పారు.
ఘటనా స్థలాన్ని క్రైమ్ టీమ్ పరిశీలించింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302, ఆయుధ చట్టంలోని సంబంధిత సెక్షన్‌ల కింద ఘాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఆమె తెలిపారు. "ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. సీసీటీవీలు, కాల్ వివరాల రికార్డులను విశ్లేషిస్తున్నారు. కేసును ఏసీపీ మధు విహార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బృందాలను రంగంలోకి దించి 10 గంటలలోపే నిందితులిద్దరినీ పట్టుకున్నామని డీసీపీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘాజీపూర్‌లో నివాసముంటున్న ఆకాష్ 9వ తరగతి ఉత్తీర్ణుడై తన నివాసం నుంచి డీజే దుకాణం నడుపుతుండగా, ఘరోలీ ఎక్స్‌టెన్షన్‌లో నివాసం ఉంటున్న అతని బంధువు విశాల్ 2020లో 12వ తరగతి ఉత్తీర్ణుడై అప్పటి నుంచి ఏమీ చేయడం లేదు.