విషాదం.. పెంట్ హౌస్ స్లాబ్ ప‌డి నాలుగేళ్ల చిన్నారి దుర్మ‌ర‌ణం

4 Years girl dead after under construction pen house wall collapse.కూక‌ట్‌ప‌ల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2022 8:52 AM GMT
విషాదం.. పెంట్ హౌస్ స్లాబ్ ప‌డి నాలుగేళ్ల చిన్నారి దుర్మ‌ర‌ణం

కూక‌ట్‌ప‌ల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిపై నిర్మిస్తున్న పెంట్‌హోస్ స్లాబ్ విరిగి ప‌డి నాలుగేళ్ల చిన్నారి దుర్మ‌ర‌ణం చెందింది. వివ‌రాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన సునీల్ కుమార్‌, లూత్ మేరీ దంప‌తులు కొద్ది నెల‌ల క్రితం శాత‌వాహ‌న న‌గ‌ర్‌కు వ‌ల‌స వ‌చ్చారు. వీరికి ఓ కుమారుడు, కుమారై షారూన్ దీత్య‌(4) ఉన్నారు. ఓ బేక‌రినీ ప్రారంభించి జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. రోజులాగానే సునీల్ బేక‌రీకి వెళ్లాడు.

సునీల్‌కు టీఫిన్ బాక్స్ అందించేందుకు మేరీ త‌న కుమారైతో క‌లిసి తాము ఉంటున్న ఇంటి నుంచి బేక‌రికీ బ‌య‌లుదేరింది. బేక‌రీ వ‌ద్ద‌కు రాగానే.. ప‌క్క‌నే ఉన్న భ‌వ‌నంపై నిర్మాణంలో ఉన్న పెంట్‌హోస్‌కు సెంట్రింగ్ క‌ర్ర‌లు తొల‌గిస్తుండ‌గా స్లాబ్ విరిగి ఆ శిథిలాలు వారిద్ద‌రిపై ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో దీత్య‌కు తీవ్ర‌గాయాలు కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. మేరీకి స్వ‌ల్ప గాయాలు కాగా.. సైకిల్ పై వెలుతున్న మ‌రో బాలుడికి గాయ‌లైయ్యాయి

కాగా.. కళ్ల ఎదుటే బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి విచారణ ప్రారంభించారు.

Next Story
Share it