కోనసీమ జిల్లాలో రోడ్డుప్ర‌మాదం.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

By Medi Samrat  Published on  15 May 2024 4:04 AM GMT
కోనసీమ జిల్లాలో రోడ్డుప్ర‌మాదం.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. జిల్లాలోని పి గన్నవరం మండల పరిధిలోని ఊడిమూడి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆర్టీసీ బస్సు, కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. క్షతగాత్రులు కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను నూకపల్లి శివ (35), వాసంశెట్టి సూర్య ప్రకాష్ (50), వీరి కట్లయ్య (45), చిలకలపూడి పాండాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేశారు.

Next Story