పేలిన‌ కెమికల్‌ ట్యాంకర్‌.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

4 killed as chemical tanker explodes on Mumbai-Pune expressway. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలిపోయింది.

By M.S.R  Published on  13 Jun 2023 8:45 PM IST
పేలిన‌ కెమికల్‌ ట్యాంకర్‌.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లోనావాలా - ఖండాలా ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారని, ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని లోనావాలా సబ్ డివిజన్ డీఎస్పీ సత్య సాయి కార్తిక్ తెలిపారు.

ఎక్స్‭ప్రెస్‭వే ప్రయాణిస్తున్న మిథనాల్‌తో వెళ్తున్న ఒక ట్యాంకర్ లోనోవాలా సమీపంలో ఒక్కసారిగా బోల్తా పడింది. అనంతరం ట్యాంకర్‭లో మంటలు వ్యాపించి ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో నలుగురు వ్యక్తులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన ఉన్న రాయిని ఢీకొట్టిన ట్యాంకర్ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదం అనంతరం ముంబై-పూణె ఎక్స్‭ప్రెస్‭వేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.


Next Story