లారీ-కారు ఢీ.. నలుగురు దుర్మరణం

4 Died after lorry collided with car in Kadapa.క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. లారీ, కారు ఢీకొన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2021 2:23 AM GMT
లారీ-కారు ఢీ.. నలుగురు దుర్మరణం

క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను క‌డ‌ప స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి త‌రువాత మైదుకూరు-బ‌ద్వేలు హైవేపై డి.అగ్ర‌హారం స‌మీపంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. అనంత‌పురం నుంచి ట‌మోటాల‌తో విజ‌య‌వాడ వెళ్లేందుకు మైదుకూరు, బ‌ద్వేలు వైపున‌కు వెలుతున్న లారీ.. క‌ర్ణాట‌క రాష్ట్రం మొగల్కోట్ ప్రాంతానికి చెందిన కారును ఢీ కొట్టింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. లారీ కూడా బోల్తా ప‌డింది. కారులో ప్ర‌యాణీస్తున్న స‌ద్దాం, రేష్మ‌, భాష‌లు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. తీవ్రంగా గాయ‌ప‌డిన స‌ల్మా బ‌ద్వేలు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధితులు క‌ర్ణాట‌కలోని మొగ‌ల్‌కోట నుంచి క‌డ‌ప మీదుగా నెల్లూరు వెలుతూ ప్ర‌మాదం బారిన ప‌డ్డారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story