గణతంత్ర దినోత్సవం రోజున.. మహిళను కిడ్నాప్ చేసి, జుట్టు కత్తిరించి.. సామూహిక అత్యాచారం

4 arrested after assault on Delhi woman on R-Day. భారత గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలో ఒక

By అంజి  Published on  27 Jan 2022 8:00 AM GMT
గణతంత్ర దినోత్సవం రోజున.. మహిళను కిడ్నాప్ చేసి, జుట్టు కత్తిరించి.. సామూహిక అత్యాచారం

భారత గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలో ఒక మహిళను కిడ్నాప్ చేసి, క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. మహిళపై దాడి చేసిన తర్వాత.. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుడితో మహిళకు ఉన్న వ్యక్తిగత శత్రుత్వమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు మహిళ జుట్టును కత్తిరించి, బూట్లతో దండలు వేసి వీధుల్లో నడిచేలా చేశారు.

ఆ బాధిత మహిళకు వివాహమై ఒక బిడ్డ కూడా ఉంది. గతంలో ఆమెను వెంబడించిన పొరుగున ఉండే యువకుడు నవంబర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి ఆత్మహత్యకు యువతి కుటుంబీకులు కారణం అని సమాచారం. అయితే ఈ ఘటనపై బాధిత మహిళ చెల్లెలు పోలీసులకు సమాచారం అందించింది. ప్రస్తుతం ఆ మహిళకు కౌన్సెలింగ్‌ జరుగుతోంది. "వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఒక మహిళపై లైంగిక వేధింపుల దురదృష్టకర సంఘటన షహదారా జిల్లాలో జరిగింది. పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. విచారణ కొనసాగుతోంది.

బాధితురాలికి అన్ని విధాలుగా సహాయం, కౌన్సెలింగ్ అందించబడుతున్నాయి" అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు సామూహిక అత్యాచారంపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ పోలీసులకు కూడా కమిషన్ నోటీసు జారీ చేస్తుందని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు. అక్రమ మద్యం విక్రయదారులు మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారని ఆమె చెప్పారు.

Next Story
Share it